Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: వైఎస్ వాహన మిత్ర కింద 9 కోట్లు జమ

Nandyala: వైఎస్ వాహన మిత్ర కింద 9 కోట్లు జమ

వాహన మిత్రతో పేదలకు సాయం

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద నంద్యాల జిల్లాలో 8892 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 89 లక్షల 20 వేల రూపాయలు పంపిణీ చేసామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలోని విద్యాధరపురం నుండి వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం క్రింద రాష్ట్రవ్యాప్తంగా 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 275.93 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కారక్రమాన్ని లైవ్ ద్వారా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారుడు డీఎస్ హాబీబుల్లా, రాష్ట్ర దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృత రాజ్, జిల్లా రవాణా అధికారి జి.వి. శివారెడ్డి తదితరులు వీక్షించారు.అనంతరం జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జిల్లాలోని ఆటో, ట్యాక్సీ, ఎండియూ ఆపరేటర్లు, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటూ వారు సకాలంలో ఇన్సూరెన్స్, అవసరమైన రిపేర్లు చేయించుకునేందుకు వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద వరుసగా ఐదో ఏడాది మొత్తం 8892 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 89 లక్షల 20 వేల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారన్నారు.

- Advertisement -

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 1194 లబ్ధిదారులకు 1,19,40,000/- బనగానపల్లె నియోజకవర్గంలో 1074 లబ్ధిదారులకు 1,07,40,000/- డోన్ నిజకవర్గంలో 1221 లబ్ధిదారులకు 1,22,10,000/- నందికొట్కూరు నియోజకవర్గంలో 1565 లబ్ధిదారులకు 1,56,50,000/- నంద్యాల నియోజకవర్గంలో 1862 లబ్ధిదారులకు 1,86,20,000/- పాణ్యం నియోజకవర్గంలో 554 లబ్ధిదారులకు 55,40,000/- శ్రీశైలం నియోజకవర్గంలో 1422 లబ్ధిదారులకు 1,42,20,000/- వెరసి మొత్తం 8892 మంది లబ్ధిదారులకు 8,89,20,000/- రూపాయిలు జమచేశారన్నారు.ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు వున్నా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లు ఇబ్బందులు పడకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి ఏడాది డ్రైవర్లకు 10 వేల రూపాయలు ఇవ్వడం అభినందించ విషయమన్నారు.నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ సొంత వాహనం కలిగి వున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల్లో ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు 1301.89 కోట్ల రూపాయలను వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించిందన్నారు. అనంతరం అన్ని నియోజకవర్గాల నుండి వచ్చిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండియూ ఆపరేటర్లకు 8,89,20,000 రూపాయల మెగా చెక్కును పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News