Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: సకాలంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు

Nandyala: సకాలంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు

25 శాఖలకు సంబంధించి 43 సంక్షేమ పథకాలు అందజేయండి

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ పథకాలను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నంద్యాల పార్లమెంట్ సభ్యులు, జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ చైర్మన్ పోచా బ్రహ్మానంద రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో దిశ కమిటీ సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్, ఆళ్లగడ్డ శాసనసభ్యులు బ్రిజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ 25 శాఖలకు సంబంధించి 43 సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేటాయించిన పనులు పూర్తి చేస్తే సంబంధిత పథకాల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. జల జీవన్ మిషన్, వ్యవసాయం, పంచాయితీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, మునిసిపల్, డిఆర్డీఏ, వైద్య ఆరోగ్య, జాతీయ రహదారులు, పరిశ్రమల శాఖలచే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చైర్మన్ సమీక్షించారు. భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను తనకి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ను ఎంపీ ఆదేశించారు.ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ కింద పొలాలకు వెళ్లేందుకు రహదారులు నిర్మించాలని అధికారులను సూచించారు. జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న పనులను ప్యాకేజీ కింద టెండర్లు పిలవకుండా వ్యక్తిగత టెండర్లు పిలిచేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జల జీవన్ పథకం పధకం కింద ఇంటింటి కొళాయి పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బనగానపల్లెలో జలజీవన్ పథకం అమలు బాగా జరిగినట్లు ఇటీవల కేంద్ర బృందం కూడా అభినందించినట్లు కలెక్టర్ దిశా కమిటీలో ప్రస్తావించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందరికీ విద్యలో భాగంగా బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గోరుముద్ద కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసి ఆహార పదార్థాలలో నాణ్యత పాటించి పోషకాహార పదార్థాలు పిల్లలకి అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలకు పోషకాహారం ఇవ్వడంతో పాటు బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ అధికారులను ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం క్రింద జెఎస్వై పథకం ద్వారా గర్భవతిగా వున్న ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయిలు, ప్రధాన మంత్రి మాతృ యోజన పథకం 6400 మందికి 6 వేల రుపాయలు ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులై ఉండి ఇంకా పెన్షన్ పొందని లబ్ధిదారులు జగనన్న సురక్ష కార్యక్రమం కింద గుర్తించాలని డిఆర్డిఏ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డ్వామా పిడి రామచంద్రారెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News