Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: అమరవీరుల దినోత్సవం

Nandyala: అమరవీరుల దినోత్సవం

అమరులైన పోలీసుల త్యాగాలు గుర్తుచేసుకున్న..

నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయం నందు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగనిరతిని సంస్కరించుకొనుటకు ప్రతి సంవత్సరము అక్టోబర్ 21 వ తేదీని పోలీసు అమరవీరుల సంస్మరణ దినముగా పరిగణిస్తున్నాము. దేశ మరియు రాష్ట్ర భద్రత కోసం పగలనక, రేయనక విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది డ్యూటిని విజయవంతముగా నిర్వహించడములో భాగంగా తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల శ్రేయస్సుకై ప్రాణాత్యాగం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఈ త్యాగాలను, సేవలను సింహావలోకనం చేసుకుంటూ సేవ యొక్క అర్ధాన్ని, పరమర్ధాన్ని గుర్తిస్తూ వీరిని కొనియాడుట మన అందరి కర్తవ్యము. 1959 అక్టోబరు 21 వ తేదీన భారత్ – చైనా సరిహద్దు లఢఖ్లోని హాట్ స్ప్రింగ్ వద్ద పహారాలో ఉన్నటువంటి 10 మంది సి.ఆర్.పి.ఎఫ్ జవానులపై చైనా చొరబాటుదారులు దాడి చేయగా ధైర్యసహసాలతో వారిపై ప్రతి దాడి చేస్తూ తమ చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి వీరమరణం పొందారు. స్వాతంత్రం తరువాత దేశభద్రత కోసం పోలీసులు ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి సంఘటన అది. అప్పటి నుండి ప్రతి సంవత్సరము విధినిర్వహణలో మరణించిన పోలీసువారి జ్ఞాపకార్థం అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినముగా జరుపుకొనుచున్నాము.

- Advertisement -

ఒకరి కోసం చేసే త్యాగం ఉన్నతమైనదైతే ప్రజారక్షణ కోసం చేసే త్యాగం మహోన్నతమైనది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధినిర్వహణలో పోలీసుల వీరమరణాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటున్నాము. జిల్లా పోలీసు యంత్రాంగం తరుపున మనమంతా ఈ రోజును “పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తూ” అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తున్నామన్నారు.నాటికి దేశవ్యాప్తంగా 188 మంది పోలీసులు వీరమరణం పొందినారని తెలియజేశారు.నంద్యాల జిల్లాలో పోలీసు వారికి,హోంగార్డ్ వారి,డబ్లుపిసి లకు వారి కుటుంబసభ్యులకు ప్రైవేటు డాక్టర్ లచే ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయించడం జరిగిందన్నారు.పోలీసు మరణినించిన తర్వాత వారి కుటుంబాలకు బెన్ఫిట్స్ లను అందించడం జరిగిందని,మరియు పోలీసు కుటుంబాలలోని పిల్లకు స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఫీజులు తిగ్గించేందుకు ఏర్పరు చేశామని తెలియజేశారు. పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ వారి యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించుటకు కృషిచేస్తున్నాము.నంద్యాల జిల్లా పోలీసు యంత్రాంగము ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళతామని తెలుపుకుంటున్నామన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మనజీర్ జిల్లాని సామాన్ మాట్లాడుతూ పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మాత్రం మేల్కొని కాపలా కాస్తుంటారని శాంతి భద్రతల పరిరక్షణ మరియు ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తూ ఉంటారని,అది మన దేశం యొక్క బోర్డర్ లో గాని అంతర్గతంగా గాని ప్రతిక్షణం పోలీసులు మేల్కొని కాపలా కాస్తుంటారని,దేశానికి బద్రత లేకపోతే అభివృద్ది ఆగిపోతుందని అందుకే వారిని గౌరవించాలని తెలియజేశారు.ఏదైనా నేరం జరిగినప్పుడు నేరం జరిగిన ప్రదేశంలో పోలీసులు ఉన్నారు అంటే మాకు ఒక ధైర్యం వారు ఎలాగైనా నేరస్థులను పట్టుకుంటారని అనే నమ్మకం ఉందని నమ్మకాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటా ఉన్నామని కలెక్టర్ తెలిపారు.అదేవిధంగా పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకు డ్యూటీలలో ఉంటూ కుటుంబ పరంగా ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఆ త్యాగం సమాజానికి చాలా అవసరం ఈ విషయం కుటుంబంలోని వారికి తెలియదు వారు అక్కడ త్యాగం చేయడం వల్లనే సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ జరుగుతుందని ఈ సందర్భంగా పోలీస్ కుటుంబాల వారిని కూడా గౌరవించాలని వారికి సెల్యూట్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఆంద్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి మాట్లాడుచు ప్రజల ధన,మాన ,ప్రాణ రక్షణ ప్రభుత్వానిదే అయిన ముఖ్య పాత్ర పోలీసు వారిదేనని, మన రాష్ట్రం అసాంఘిక కార్యకలాపాలపై అనుసరిస్తున్న విధానాలను దేశంలోని పొరుగు రాష్ట్రాలు మరియు పొరుగు దేశాల వారు తెలుసుకొని వెళ్తున్నారని ఇది నేను స్వయంగా దక్షిణ దేశ రాష్ట్రాల మీటింగ్ లకు హాజరైనప్పుడు తెలుసుకున్న విషయమని తెలియజేశారు. మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కొరకు ఏర్పాటు చేసిన దిశ యాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉందని తెలియజేశారు. మరియు ఎన్నో విషయాలలో పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ముఖ్యమంత్రి మాట్లాడి వారికి ప్రభుత్వం నుండి వారికి రావలసిన బెనిఫిట్స్ ను అందజేయడం జరిగిందని తెలియజేశారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి.వెంకట రాముడు మన దేశం ప్రజల రక్షణ కోసం అమరులైన వారి పేర్లు వివరాలను ప్రజలకు చదివి వినిపించారు.ప్రజల కోసం వారి రక్షణలో ముందు ఉంది వారి ధన,మాన,ప్రాణాలను కాపాడేది పోలీసు శాఖనే అని తెలియజేశారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, ఎస్పీ రఘువీర్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హాబీబుల్లా, జల వనరుల ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News