Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: సిద్ధం సభను విజయ వంతం చేయండి

Nandyala: సిద్ధం సభను విజయ వంతం చేయండి

మేమంతా సిద్ధమంటున్న లీడర్స్

ఈనెల 28వ తేదీన నంద్యాలలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని ఉదయానంద రెసిడెన్సి కాన్ఫరెన్స్ హాల్లో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నంద్యాల అధ్యక్షుడు ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్ర నాథ్ రెడ్డి, పరిశీలకులు మల్కి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి కర్నూలు నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 27వ తేదీన వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర సభను ఈనెల 27వ తేదిన ఇడుపులపాయలో ప్రారంభించి ఈనెల 28వ తేదీ నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో చేసిన పరిపాలన, నాడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను, మేనిఫెస్టోను అమలు చేసిన విధానాన్ని , ప్రజలకు జరిగిన మేలుల గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా జగన్మోహన్ రెడ్డి పరిగణించి ఇచ్చిన ప్రతి హామీలను 95 శాతం అమలుపరిచారన్నారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం కల్పించాలని కోరడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో చేపట్టనున్న “మేమంతా సిద్ధం” భారీ బహిరంగ సభకు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు.

నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర సభలను అన్ని జిల్లాల కేంద్రాల వారిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీ నంద్యాలలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 27న ఇడుపులపాయ నుండి “మేమంతా సిద్ధం సభ బస్సు యాత్ర ప్రారంభమై కొనసాగుతూ అదే రోజున సాయంత్రం 5 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుతుందని అక్కడ సభ పూర్తి చేసుకొని ఆళ్ళగడ్డలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాత్రి బస చేస్తారన్నారు. మరుసటి రోజు 28వ తేదీ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో “మేమంతా సిద్ధం” సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను, నవరత్నాలను అన్నింటిని అమలుపరిచారని తెలిపారు. ఈ సభలో వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన హామీల అమలు, ప్రతిపక్ష టిడిపి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అమలు మధ్య తేడాలను ప్రజలకు వివరంగా తెలియజేస్తామన్నారు. టిడిపి వారు ఇచ్చిన మేనిఫెస్టోను కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం రాష్ట్రంలో అభివృద్ధిని సాధించామన్నారు. రాయలసీమలోని రాప్తాడులో సిద్ధం సభ అత్యంత భారీ ఎత్తున నిర్వహించామని, ఆసభ ఎంతో దిగ్విజయంగా 10 లక్షల మంది పైగా పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇదే రీతిలో నంద్యాలలో నిర్వహించనున్న “మేమంతా సిద్ధం” సభ దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల సభ తర్వాత 29వ తేదీ ఎమ్మిగనూరు లో “మేమంతా సిద్ధం” సభ నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశం అనంతరం నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నందు నిర్వహించనున్న సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చైర్మన్ కల్లూరి రామలింగారెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి మాజీ జడ్పిటిసి సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పామ్ షావలి, అడ్వకేట్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News