నంద్యాల జిల్లా చాగలమర్రి శ్రీ వాసవి డిగ్రీ కళాశాల.ఈ రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2,4,6 సెమిస్టర్లు ఎగ్జామ్స్ ఉన్నాయి. గతంలో జంబ్లింగ్ విధనం ఉన్న చాగలమర్రి పట్టణంలోనే ఎగ్జామ్స్ సెంటర్ ఉండేది. ఈ సంవత్సరం జంబ్లింగ్ విధానం తీసివేసి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆళ్లగడ్డ పట్టణంలో ఎగ్జామ్స్ సెంటర్ వేశారు. దీనిపై వాసవి కాలేజ్ విద్యార్థులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. చాగలమర్రికి రావడానికి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్లు పల్లెటూర్లో వచ్చేందుకు ఎటువంటి బస్సు సౌకర్యం, ఆటోల సౌకర్యం లేదని వివరిస్తున్నారు. రావడానికి ఇబ్బంది ఉంటుందని రాయలసీమ యూనివర్సిటీ దృష్టికి తమ సమస్యను వెళ్లబోసుకున్నారు.
గతంలో ఇదే విషయంపై మాట్లాడిన యూనివర్సిటీ కంట్రోల్ ఎగ్జామినర్ చాగలమర్రి పట్టణంలో ఏదో ఒక చోట సెంటర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం హాల్ టికెట్స్ లో ఆళ్లగడ్డ సెంటర్ ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మళ్లీ ఎగ్జామ్స్ కోసం ఆళ్లగడ్డ వెళ్ళాలి అంటే తమకు చాలా ఇబ్బందని, యూనివర్సిటీ స్పందించి చాగలమర్రి పట్టణంలో సెంటర్ ఉంచాలని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా నిరసనకు దిగిన విద్యార్థులు రాయలసీమ యూనివర్సిటీ డౌన్ డౌన్ అని విద్యార్థులు నినాదాలు చేశారు.