Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: వైసీపీని గెలిపించండి: శిల్పా రవి రెడ్డి

Nandyala: వైసీపీని గెలిపించండి: శిల్పా రవి రెడ్డి

వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు

యువత తమ శక్తి సామర్థ్యాలను పార్టీ విజయానికి వినియోగించాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవి రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని దేవ నగర్, శ్యామ్ నగర్, వీసీ కాలనీ ప్రాంతంలోని యువకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి సమక్షంలో 27వ వార్డు వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ దేవ నగర్ బాషా, మేస చంద్ర శేఖర్, భాస్కర్, కంటయ్య, అధ్వర్యంలో వైయస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. యువతను ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలను కప్పారు. ఈనెల 28వ తేదీ నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభను దిగ్విజయం చేయాలని యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ది పాలన యువతను ఎంతో ఆకర్షించి పార్టీలో చేరేందుకు సిద్ధం కావడం అభినందనీయం అన్నారు. యువత తమ యొక్క శక్తి సామర్థ్యాలను భవిష్యత్ తరాలకు మంచి చేసేందుకు వినియోగించాలని కోరారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచి దిశా నిర్దేశాన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి అందరం బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈనెల 28వ తేదీ నంద్యాలలో నిర్వహించనున్న మేమంతా సిద్ధం సభను దిగ్విజయం చేయాలని కోరారు. సభలో మన సత్తా ఏంటో చూపించాలన తెలిపారు.

- Advertisement -

నంద్యాల పట్టణంలోని శ్యామ్ నగర్, దేవ నగర్, వీసీ కాలనీ ప్రాంతాలు గత ఎన్నో సంవత్సరాలు నుండి కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన సందర్భంగా ఈ ప్రాంతాన్ని విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. ప్రత్యేకంగా ఈ మూడు ప్రాంతాలలో ఉత్సాహవంతులైన యువత అత్యధికంగా రాజకీయాల వైపు ఆకర్షింపబడుతున్నారని వీరందరూ జగనన్న నాయకత్వంలో సైనికులు లాగా రానున్న ఎన్నికల్లో తమ యొక్క సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. కేవలం 50 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉందని, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వచ్చే 5 సంవత్సరాలు మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. నేటి నుండి పార్టీలో చేరిన యువత అంతా శిల్పా కుటుంబ సభ్యులని, తన ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయని తెలిపారు. మీ సమస్యలు పరిష్కరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు భాస్కర్, రమణయ్య, కంటయ్య, శ్రీను ,దుర్గ, రవి, వెంకటేశ్వర్లు, పెద్ద దుర్గా, విజయ్, రమేష్, మాలి భాష, వారి మిత్ర బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News