Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Nani: దృతరాష్టులు, దుర్యోధనులు, దుశ్శాసనులు అంతా పవన్ తోనే

Nani: దృతరాష్టులు, దుర్యోధనులు, దుశ్శాసనులు అంతా పవన్ తోనే

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అసెంబ్లీ విరామ సమయంలో మీడియాతో మాట్లాడుతూ .. పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. కులాలను రెచ్చగొడుతూ.. కులరహిత సమాజమంటావా అంటూ పవన్ పై నాని మండిపడ్డారు. అన్ని కులాలు కలిసి చంద్రబాబుకు ఊడిగం చేయాలా పవన్, కాపులను రెచ్చగొట్టి..భావోద్వేగాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం సాగుతోందని ఆయన ఆరోపించారు. మీరంతా కలిసే రండి..మేం కోరుకునేది అదే అంటూ, ఎన్నికల వరకూ ఎందుకు..? ఇప్పుడే మీరు ముసుగు తీయొచ్చు కదా.. అంటూ సవాలు విసిరారు పవన్ కు. దృతరాష్టులు, దుర్యోధనులు, దుశ్శాసనులు అంతా పవన్ తోనే ఉన్నారంటూ మాట్లాడారు. సినీ జీవితాన్నిచ్చిన చిరంజీవినీ పవన్ అవమానించాడని, అసలు చిరంజీవి గారు పార్టీని మూసేయడానికి కారణం పవన్ కాదా అన్నారు. నీ వద్ద ఏం చూసి కాపులు, కాపు నాయకులు నీ వెంట నడవాలని కడిగేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News