Monday, May 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Bhuvaneswari: వైసీపీ నేతలు అడ్డుకుంటే తొక్కుకుంటూ వెళ్ళండి

Nara Bhuvaneswari: వైసీపీ నేతలు అడ్డుకుంటే తొక్కుకుంటూ వెళ్ళండి

బాబుది సంక్షేమం జగన్ ది అక్రమం

ఏప్రిల్ నెలలో జరిగే ఎన్నికల్లో వైసీపీ నేతలు అడ్డుకుంటే వారిని తొక్కుకుంటూ వెళ్లి టిడిపికి ఓటు వేయాలని నారా భువనేశ్వరి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణం, మండలంలోని పెంచికలపాడు గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి మూడు లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సామాన్య ప్రజల శ్రమను దోచుకుని అక్రమాలకు పాల్పడుతూ వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని అన్నారు.

- Advertisement -

చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్రమాలు, అవినీతే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవినీతి ప్రభుత్వం పోవాలంటే ప్రజలు ఐక్యమత్తంగా టిడిపికి ఓటు వేసి గెలిపించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీడీ నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, టిడిపి నాయకులు కృష్ణుడు, జే సురేష్, గోపాల్ రెడ్డి, ఎంపిటిసి కె మద్దిలేటి, అలీఫ్,రవి, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News