Nara Lokesh Visakhapatnam Novotel: టీడీపీలో నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడుల మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనది. ఒకవైపు ఇద్దరూ యువ నేతలు, మరోవైపు వారి కుటుంబాలకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. విశాఖపట్నం పర్యటనలో జరిగిన ఒక సంఘటన దీనిని మరోసారి రుజువు చేసింది. విశాఖలో జరిగిన ఒక సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి చివరగా మాట్లాడాలి. కానీ, రామ్మోహన్ నాయుడు ప్రసంగం కోసం లేవగా, లోకేష్ వెంటనే ఆయనను వారించి వద్దు రాము, ప్రోటోకాల్ ప్రకారం నువ్వు చివరిగా మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడతానని అన్నారు. ఈ సంఘటనలో లోకేష్ చూపించిన పరిణతి అందరినీ ఆకట్టుకుంది.
https://twitter.com/JaiTDP/status/1961484295266288088
వ్యక్తిగత బంధానికి ప్రాధాన్యం: “రాము” అని చనువుగా పిలవడం ద్వారా లోకేష్ వారి మధ్య ఉన్న వ్యక్తిగత బంధం ఎంత బలమైనదో చూపించారు. ఇది కేవలం రాజకీయ సంబంధం కాదని, అన్నదమ్ముల వంటి ఆత్మీయ బంధమని స్పష్టం చేసింది.
ALSO READ: Chandrababu :పద్దతి మార్చుకోండి..ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మాస్ వార్నింగ్
అదే సమయంలో, ఒక కేంద్రమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ప్రోటోకాల్‌ను లోకేష్ పాటించారు. పదవులు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరని ఆయన నిరూపించారు. ఈ చర్య ద్వారా లోకేష్ తనలోని పరిణతిని, రాజకీయ నాయకుడిగా ఆయన పెరుగుతున్న అవగాహనను చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


