Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: సిపిఎస్ ను రద్దు చేయమని లోకేష్ కు విజ్ఞప్తి

Nara Lokesh: సిపిఎస్ ను రద్దు చేయమని లోకేష్ కు విజ్ఞప్తి

ఉపాధ్యాయుల కు సిపిఎస్ రద్దు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ( ఏపిసీపిఎస్ఈఏ) రాష్ట్ర కౌన్సిలర్ చిగిలి రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ కోరారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సాగిస్తున్న యువగళం పాదయాత్రలో లో నారా లోకేష్ ను ఉపాధ్యాయులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ( ఏపిసిపిఎస్ఈఏ) ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీ రామాంజనేయులు, శ్రీనివాసులు, నారాయణ మాట్లాడుతూ తమ సర్వీసు పూర్తి అయ్యాక వాయో బారంతో ఉన్న తమకు భరోసా ఇచ్చే పెన్షన్ ను పునరుద్దరణ చేయాలని కోరారు. మీరు అధికారంలోకి వచ్చాక సిపి ఎస్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇందుకు స్పందించిన లోకేష్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ పై చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News