మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) పుట్టినరోజు సందర్భంగా సెలబ్రెటీలు, అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ బావ, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు. “హ్యాపీ బర్త్ డే తారక్. ఈ ఏడాది సంపూర్ణ సంతోషం పొందాలని, విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. లోకేశ్ పోస్టుకు ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. శుభాకాంక్షలు తెలియజేసిందుకు కృతజ్ఞతలు అంటూ బదులిచ్చారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nara Lokesh: లోకేశ్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఎన్టీఆర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES