ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు(AP MLC Results) ఏకగ్రీవం అయ్యాయి. జనసేన పార్టీ తరపున కొణిదెల నాగబాబు(Nagababu), టీడీపీ నుంచి బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు గడువు నేటితో ముగియడంతో వీరంతా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. రిటర్నింగ్ అధికారి నుంచి వీరు ధృవీకరణ పత్రాలు అందుకున్నారు.
- Advertisement -
కాగా కూటమి పార్టీకి 164 ఎమ్మెల్యే సీట్లు ఉండటంతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు దక్కాయి. ఇందులో టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన, బీజేపీ చెరో ఒక్కరు అభ్యర్థులుగా నిలిచారు. తాజాగా వీరి ఎన్నిక ఏకగ్రీవం కావడంతో శాసనమండలిలో కూటమి సభ్యుల సంఖ్య పెరగనుంది.