నంద్యాల జిల్లా శిరివెల్ల మండలం యర్రగుంట్ల గ్రామంలో జగన్‌తో చర్చ కార్యక్రమం సాగింది. వివిధ వర్గాలతో ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. కార్యక్రమంలో చివరగా సీఎం మాట్లాడుతూ ఏమన్నారంటే..
“మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. అందరితో బహుశా మాట్లాడే అవకాశం, పరిస్థితులు కూడా సమయాభావ కారణాల వల్ల అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి.. మీ అందరికీ ఎలాగూ స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పుల్లో మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నవి ఆ బాక్సులో వేస్తే అవి ఎలాగూ నా దగ్గరికి వస్తాయి. అందులో మనం ఏదైనా సలహా తీసుకుని… ఉన్న వ్యవస్థను ఇంకా కొంత బాగు పరిచే కార్యక్రమంలో భాగంగా ఇంకా ఏమైనా బెటర్ గా చేయగలిగే అవకాశాలు, పరిస్థితులు ఉంటే కచ్చితంగా చేసేందుకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపెట్టుకుంటాను అని కూడా మీ అందరితో మరొక్కసారి తెలియజేస్తూ.. మీరు వచ్చి మీ సలహాలు, సూచలు ఇస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఈ గ్రామ వాసులందరికీ మనస్పూర్తిగా హృదయపూర్వకంగా పేరుపేరునా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకొంటూ సెలవు తీసుకుంటున్నాను”.. అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.