Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే శ్రీవారి దర్శనం జరుగుతోంది. కొద్దిపాటి రద్దీ ఉన్నప్పటికీ అధికారులు భక్తులను వెంటవెంటనే దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంటుల్లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏడుకొండలవాడిని భక్తులు వేగంగా దర్శంచుకుని స్వస్థలాలకు వెళ్తున్నారు.

- Advertisement -

సోమవారం శ్రీవారిని 63,729 మంది భక్తులు దర్శించుకోగా.. 20,957 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.85కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం, వసతి విషయంలో దళారులు మాటలు నమ్మి మోసపోకండని అధికారులు హెచ్చరిస్తున్నారు. భక్తులకు ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ సంప్రదించాలని.. దళారులను గుర్తిస్తే విజిలెన్స్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌:18004254141కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

మరోవైపు తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులకు భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోఎంది. బెదిరింపులను సీరియస్‌గా తీసుకుని.. అడుగుడుగునా తనిఖీలు చేపడుతోంది. ఆకతాయిలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు మెయిల్స్ ఎక్కువయ్యాయని.. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News