Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pamulapadu: తొగూరు ఆర్థర్ కాంగ్రెస్ చేరికను సెలబ్రేట్ చేసుకున్న వైసీపీ!

Pamulapadu: తొగూరు ఆర్థర్ కాంగ్రెస్ చేరికను సెలబ్రేట్ చేసుకున్న వైసీపీ!

తొగూరుకు అండగా..

నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న తొగూరు ఆర్ధర్ కాంగ్రెస్ లో చేరటంతో స్థానికంగా సంబరాలు జరుగుతున్నాయి. పాములపాడు మండల నాయకులు ఈమేరకు ఆర్ధర్ ను కలిసి తమ సంతోషాన్ని పంచుకోవటం విశేషం.

- Advertisement -

నెమలి రమణారెడ్డి, గంట.రమేష్, వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, నాయకులు వై.దానమయ్య, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వి. రామసుబ్బయ్య, బ్రహ్మయ్య ఆచారి, వెంకటేశ్వర రెడ్డి, జానయ్య, నాగార్జున, మధుశేఖర్, వెంకటేశ్వర్లు, భాస్కర్ గౌడ్, చెన్నయ్య, వినోద్, సాయి కృష్ణ, బోయ.నాయుడు, గుండాలనట్టు దుర్గయ్య, రఘునాయక్ తదితరులు పుష్పగుచ్చం చేతికిచ్చి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరము కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి, దేశం అభివృద్ధి చెందుతుందని “కాంగ్రెస్ పార్టీకే నా ఓటు- మీ ఓటు” అని ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ నాయకత్వం వర్ధిల్లాలని, జై సోనియాగాంధీ, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై వైయస్ షర్మిల, జై కాంగ్రెస్ పార్టీ అని నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News