Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: కార్పొరేట్ సెలూన్ షాపులను రద్దు చేయండి

Pathikonda: కార్పొరేట్ సెలూన్ షాపులను రద్దు చేయండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కార్పొరేట్ సెలూన్ షాపులను రద్దు చేయాలని నాయి బ్రాహ్మణుల సంఘం తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తాశీల్దార్ విష్ణు ప్రసాద్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జయరాముడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కార్పొరేట్ సెల్ షాపులు పెట్టడం వలన నాయి బ్రాహ్మణులు కులవృత్తిపై ఆధారపడి బతుకుతున్న చిన్న మధ్య తరగతి నాయి బ్రాహ్మణుల బ్రతుకులు చింద్ర మవుతున్నాయని, గుర్తింపులేని కార్పొరేట్ సెలూన్ షాపులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్రామీణ స్థాయిలో నాయి బ్రాహ్మణులను అంటరాని వారిగా కుల వివక్షతకు గురి చేస్తున్నారని, పల్లెలు విడిచి పట్టణాలలో ఎక్కడో ఒకచోట షాపులు పెట్టుకుని బతుకుతున్నామని,జిల్లా వ్యాప్తంగా బ్యూటీ పార్లర్ పేరుతో అనేక చోట్ల మా జీవనాధారంపై ప్రభావం చూపుతున్న షాపులను ఎత్తివేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు ఏకతాటిపై వచ్చి ఉద్యమం ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు గోవిందరాజులు, రవిచంద్ర, కారన్న, లింగన్న, నరసింహులు, రఘు, రామంజి పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News