రాష్ట్ర ముఖ్యమంత్రి పత్తికొండ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులంతా సమన్వయంతో పని చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అధికారులను ఆదేశించారు. పత్తికొండలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కలెక్టర్, ఎస్పీ కలిసి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించారు. పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్,సెయింట్ జోసెఫ్ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న వేదికను పరిశీలిస్తూ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బంది,పోలీసు అధికారులకు సూచించారు.సభా వేదికపై ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.సభా ప్రాంగణంలో ఉన్న కంపార్ట్మెంట్ లలో ఒకటి విఐపిల కోసం,ఒకటి పాత్రికేయుల కోసం, మిగతా కంపార్ట్మెంట్లు రైతులు,ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.సభా ప్రాంగణానికి వచ్చే వారికి ఎండ తీవ్రత దృష్ట్యా మజ్జిగ, త్రాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.వీలైనంత మంది పారిశుద్ధ్య కార్మికులను సభా ప్రాంగణంలో కేటాయించి ప్రాంగణం అంతా శుభ్రంగా ఉండే విధంగా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.విద్యుత్, ఫైర్,పబ్లిక్ అడ్రస్ సిస్టం,ఎల్ఈడి స్క్రీన్స్ తదితర ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్,ఇంటెలిజెన్స్ డిఎస్పీ ఎస్ఎస్జి రాజారెడ్డి,పత్తికొండ ఆర్డీఓ మోహన్ దాస్,ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి,రమణ కాంత్ రెడ్డి,ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగరాజు,ఆదోని మున్సిపల్ కమీషనర్ రఘునాథ్ రెడ్డి,ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనర్ గంగి రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Pathikonda: ముఖ్యమంతి సభను విజయవంతం చేయండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES