మోడీ ప్రభుత్వాన్ని దించుదాం, దేశాన్ని కాపాడుకుందాం ప్రచార భేరి ఏప్రిల్ 14-30 వరకు విస్తృతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నాలుగు రోజులపాటు పత్తికొండ మండలంలోని కొత్త పల్లె, పులికొండ, కనకదీన్నె, పందికోనల్లో ప్రచారభేరి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య పాల్గొన్నారు. దేశ ప్రజాస్వామ్యం రాజ్యాంగం బిజెపి పరిపాలనలో ప్రమాదంలో పడిందని, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన దేశ ప్రజల మధ్య బిజెపి ఆర్ఎస్ఎస్ కూటమి మత విద్వేషాలను చిచ్చు రాజేస్తుందని గిడ్డయ్య ఆరోపించారు. ప్రజల సంపదగా ఉన్న బ్యాంకులను ప్రభుత్వ రంగ పరిశ్రమలని ఓడరేవులని ఆఖరికి వ్యవసాయం సైతం కార్పొరేట్ వ్యక్తులకు ధారాధత్వం చేస్తుంది పైగా మరింత వేగంగా దేశంలోని అడుగులను భూములను విద్యుత్ ప్రాజెక్టులను గనులను కార్పొరేట్ వ్యక్తులకు ఆయన అంబానీ, అదానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారన్నారు.
బి.జె.పి ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి జిల్లా సమితి సభ్యులు తిమ్మయ్య కారన్న పట్టణ కార్యదర్శి రామాంజనేయులు ఏఐటి యు సి నాయకులు నెట్టికంటయ్య కొత్తపల్లి సిపిఐ కార్యదర్శి గిడ్డయ్య గౌడ్ పందిపిల్ల సిపిఐ కార్యదర్శి కాశి పెద్దహుల్తి శాఖ కార్యదర్శి రాజప్ప రామచంద్ర మాదన్న పట్టణ సహాయ కార్యదర్శులు శ్రీనివాసులు ఎన్ కే సుంకన్న , సిపిఐ కార్యకర్తలు సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.