తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రశంసలు కురిపించారు. రేవంత్ రెడ్డి బలమైన నాయకుడని.. కిందిస్థాయి నుంచి పైకి వచ్చిన గొప్ప నేత అని కొనియాడారు. రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ ఆయన వ్యవహరించలేదని.. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు.
తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్(Allu Arjun) స్థానంలో రేవంత్ ఉన్నా పోలీసులు అలానే అరెస్టు చేస్తారని తెలిపారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కరెక్ట్ కాదన్నారు. తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన బన్నీలో ఉందని చెప్పారు. సినిమా అంటే అందరి భాగస్వామ్యం ఉంటుందని.. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం సరికాదని పవన్ వెల్లడించారు.