ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark shankar) ఇటీవల అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చిన్నారి చేతులు, కాళ్ళకు స్వల్ప గాయాలు కాగా.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను అంటూ చేతులతో సైగ చేశాడు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ తన కుమారుడిని చూడటం కోసం సింగపూర్‌కు వెళ్లారు. అలాగే చిరంజీవి దంపతులు కూడా పవన్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆకాంక్షిస్తున్నారు.