Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddakadaburu: బోడమ్మ.. ఆమె ఆటో రాణి

Peddakadaburu: బోడమ్మ.. ఆమె ఆటో రాణి

ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్న మహిళ

కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలం పరిధిలోని కంబళదిన్నే గ్రామానికి చెందిన బుడిజగ్గుల ప్రబాకర్ భార్య బోడమ్మ అనే మహిళ ఆటో నడుపుతూ అందరని కనువిందు చేసి అచార్యానికి గురి చేసింది. అయితే అమె ఆటో నడపాలని ఆలోచన ఎలా వచ్చిందని ఆమెను అడిగినప్పుడు అమె మాట్లాడుతూ.. రూరల్ డెవలప్మెంట్ సంస్థ వ్యవస్థాపకులు అయిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశీస్సులతో వారి తనయుడు మాన్స్ ఫెర్రర్ సతీమణి విశాల ఫెర్రర్ స్పూర్తితో, అమె అడుగుజాడల్లో నడుస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

- Advertisement -

విశాల ఫెర్రర్ ఇచ్చిన మనోధైర్యంతో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, విశాల మేడమ్ మాటలతో తనకు ఈ ఆలోచన వచ్చిందంటున్నారు. కేవలం భర్త తెచ్చే సంపాదనతో కుటుంబం గడవటం కష్టం కావటంతో ఆటో నడపటం మొదలుపెట్టినట్టు ఆమె వివరించటం ఆశ్చర్యపరుస్తోంది. ఆర్డీటీ వారి సహకారంతో ఇలా ఆటోను ఉపాధిగా మార్చుకున్నట్టు తెలిపారు. ఎమ్మిగనూరు ఏరియా టీమ్ లీడర్ ఎ.టి.యల్ సుబ్రహ్మణ్యం సహకారం ఇందుకు మరింత చేయూతనిచ్చిందన్నారు. ప్రోత్సహికంగా 3.50 లక్షల రూపాయలు అందటంతో ఇదంతా సాకారమైందన్నారు. తనకు ఒక నెల రోజులుపాటు ఆటో శిక్షణతో పాటు డ్రైవింగ్ నేర్పించి తనను ప్రోత్సహించారని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News