పెద్దకడబూరు మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలో స్థానిక అంగన్ వాడి-2 భవనం అర్ధాంతరంగా నిలిచిపోయిందని గ్రామ ప్రజలు పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. దీంతో తెలుగు ప్రభ పత్రికలో రాసినటువంటి ఈ కథనానికి అధికారుల నుంచి స్పందన వచ్చింది. తెలుగు ప్రభ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కంబలదిన్నె గ్రామం అంగన్వాడి భవనానికి మోక్షం ఎప్పుడో మరి అనే వార్త కథనానికి స్పందించిన ఐసిడిఎస్ సిడిపిఓ.ఎన్ నాగవేణి, సూపర్వైజర్ విజయ్ కుమారి సోమవారం తెలుగు ప్రభ పత్రికలో ప్రచురితమైన కథనానికి వెంటనే స్పందించామని సూపర్వైజర్ విజయ్ కుమారి తెలుగు ప్రభ విలేకరికి తెలిపారు.
ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయకుమార్ తెలియజేస్తూ అంగన్వాడి భవనముకు కోల్కేటెడ్-2 ఫేస్ కింద 3,80.000వేలు రూపాయలు మంజూరయ్యాయని, మంజూరైన ఈ అమౌంట్ రాగానే నిలిచిపోయిన అంగన్వాడి భవన నిర్మాణం పనులను అతి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో అంగన్వాడి సెంటర్ కు వచ్చే బాలింతలు, గర్భవతులు,పిల్లలు ఎవరు ఆ ధైర్యం పడాల్సిన అవసరం లేదని త్వరలోనే మీ అంగన్వాడి భవనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు, అంగన్వాడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. ఈ అంగన్వాడి భవనానికి ప్రభుత్వ అధికారులు, ఐసిడిఎస్ సిడిపిఓ ఎన్.నాగవేణి, సూపర్వైజర్, విజయ్ కుమారి, తెలుగు ప్రభ శీర్షిక కథనానికి స్పందించారు.