Thursday, December 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pushpa2: 'పుష్ప2' ఫ్లెక్సీల్లో జగన్ ఫొటో.. పిఠాపురంలో ఫ్లెక్సీలు చించివేత

Pushpa2: ‘పుష్ప2’ ఫ్లెక్సీల్లో జగన్ ఫొటో.. పిఠాపురంలో ఫ్లెక్సీలు చించివేత

Pushpa2| ఏపీ రాజకీయాల్లో ‘పుష్ప2’ మూవీ కాక రేపుతోంది. ఈ మూవీని అడ్డుకుంటామంటూ జనసేన(Janasena) నేతలు హెచ్చరికలు జారీ చేస్తుంటే.. వైసీపీ(YCP) శ్రేణులు మాత్రం భారీగా ఫ్లెక్సీలు కట్టి సంబరాలు చేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏర్పాటుచేసిన ‘పుష్ప2’ ఫ్లెక్సీలో మాజీ సీఎం జగన్ ఫోటో పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మాకోసం నీవు వచ్చావు..మీ కోసం మేము వస్తాం..తగ్గేదే లే’ అంటూ ఈ ఫ్లెక్సీలో క్యాప్షన్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.

- Advertisement -

ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో మాత్రం ‘పుష్ప2’ పోస్టర్లను చించివేయడం కలకలం రేపింది. దీంతో ఈ పోస్టర్లు చించివేయడంపై బన్నీ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఓవైపు జనసేన కార్యకర్తలు ‘పుష్ప2’ మూవీని అడ్డుకుంటామని హెచ్చరిస్తుంటే.. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు ఈ మూవీకి మద్ధతుగా సంబరాలు చేసుకుంటుండం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీగా పరిస్థితి మారిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News