Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్PMFME: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం

PMFME: ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం

స్వయం సహాయక సంఘాలకు వరం

PMFME పథకం ఆంధ్రప్రదేశ్ లోని స్వయం సహాయక సంఘాలకు వరంగా మారింది. ఈ పథకం కింద మన రాష్ట్రంలో 2021-2023 సంవత్సరానికి గాను 21,439 మంది మహిళలు 79.56 కోట్ల రూపాయలు లబ్ది పొందటం జరిగింది. మొత్తం స్వయం సహాయక సంఘ సభ్యులలో 1126 మంది హయ్యర్ ఆర్డర్ ఎంట్రప్రేన్యూర్ (HOE)గా మారి వారి యొక్క ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుచుకోవడమే కాకుండా మిగిలిన సంఘ సభ్యులకు ఉపాధిని కల్పిస్తున్నారు. లబ్దిదారుల ఆదాయం క్రమముగా మెరుగుపరచుకోవడం జరుగుతున్నది.జాతీయ స్థాయిలోనే ప్రధమ స్థానంలో ఉండటం సంతోషదాయకం.

- Advertisement -

గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆధ్వర్యంలో “ సుస్థిర జీవనోపాధుల ద్వారా సాధికారత దిశగా గ్రామీణ కుటుంబాలు భావి మార్గాన్ని చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ కొత్త తరపు మహిళా పారిశ్రామికవేత్తలు” వారి విజయానికి సంబంధించిన కొన్ని విజయగాథలను మచ్చుకి పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకాన్ని పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, సెర్ప్ సీఈవో ఏ.యండి ఇంతియాజ్, ఆర్.వై.ఎస్.ఎస్ సీఈవో శ్రీ విజయ్ కుమార్, అడిషనల్ సీఈవో విజయ కుమారి, డైరెక్టర్ జి.పద్మావతి, అదనపు డైరెక్టర్ కె.సరళ , స్టేట్ లీడ్ సుభాష్ APFPS వారు మరియు ఇతర SERP సిబ్బంది నేతృత్వంలో తేది: 09.02.2024 నాడు ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని మూడు భాషలలో (తెలుగు, ఇంగ్లీష్ , హిందీ) ప్రచురించడం జరిగింది.
భారత దేశంలో 70% జీవనోపాధులు ఆహార పదార్ధాల ఉత్పత్తులకు సంబంధిచినవే ఉన్నాయి. ఆహార ఉత్పత్తులతో పని చేస్తున్న వారికి కావలసిన ఆర్ధిక సాంకేతిక సహాయాలు అందించడం ద్వారా స్వదేశీ ఉత్పత్తుల అభివృద్దికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రాజెక్ట్-ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ అఫ్ మైక్రో క్రెడిట్ ఫుడ్ ఎంటర్ ప్రైజస్ పథకం రూపొందించటం జరిగింది.
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖ స్వయం సహాయక సంఘాల లోని మహిళలు చేస్తున్న ఆహార పదార్ధాల తయరీ కార్యక్రమం అభివృద్ధి చేసుకోవటానికి కావలసిన ఆర్ధిక సహాయము మరియు ఇతర సౌకర్యాల కల్పనను యన్.ఆర్.ఎల్.యం (నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్) సహాయంతో అన్ని రాష్ట్రాలలో ఉన్న యస్.ఆర్.ఎల్.యం (స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిషన్) ద్వారా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ అఫ్ మైక్రో క్రెడిట్ ఫుడ్ ఎంటర్ ప్రైజస్ పథకం అమలు చేయడానికి ఒప్పొందం చేసుకోవడం జరిగింది.
ఈ పథకం వ్యవధి 5 సంవత్సరాలు. ఈ పథకం సంవత్సరం 2020-2021 నుండి 2024-2025 ఉంటుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలు చేపట్టిన ఆహార పదార్ధాల తయారీ కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం మరియు సభ్యులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయటం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా అమలు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ కోపరేటివ్ సొసైటి నోడల్ సంస్థగా వ్యవహరిస్తుంది. సెర్ప్ ఆహార ఉత్పత్తులు తయారు చేసే సభ్యులను గుర్తించి నోడల్ సంస్థకు సిఫార్సు చేస్తే నోడల్ సంస్థ నిధులను విడుదల చెయ్యటం జరుగుతుంది.
పథకం ఉద్దేశం: ఆసంఘటితంగా ఆహార ఉత్పత్తుల తయారీ రంగంలో నిమగ్నమై ఉన్న వారిని, ముఖ్యంగా మహిళలను సంఘటిత రంగములోనికి వచ్చునట్లు చేయడం.
లక్ష్యాలు :
 ఆహార ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన స్వయం సహాయక సంఘ సభ్యులకు చిన్న చిన్న వస్తు పరికారలకు మరియు ముడి సరుకు కొనుగోలుకు @ రూ.40,000/- మంజూరు.
 వ్యక్తిగతంగా : ఆహార ఉత్పత్తుల తయారీ రంగంలో ఆధారపడిన వారికి 35% సబ్సిడీతో కూడిన లోన్ మంజూరు 1 లక్ష నుంచి 10 లక్షలు వరకు.
 సంఘాలు, సమాఖ్యలు, రైతు ఉత్పత్తి సంఘాలు మరియు కోపరేటివ్ సొసైటిస్ : వీటిలో ఉన్న సంఘాలు మరియు కోపరేటివ్ సొసైటిలకు 35% సబ్సిడీతో కూడిన ఋణం మంజూరు.
 ఆహార ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉన్న వారికి ప్యాకింగ్, బ్రాండింగ్ సౌకర్యం కల్పించడం.
PMFME పథకం ఆంధ్రప్రదేశ్ లోని స్వయం సహయక సంఘాలకు వరంగా మారింది. ఈ పథకం కింద మన రాష్ట్రంలో 2021-2023 సంవత్సరానికి గాను 21,439 మంది మహిళలు 79.56 కోట్ల రూపాయలు లబ్ది పొందటం జరిగింది. మొత్తం స్వయం సహాయక సంఘ సభ్యులలో 1126 మంది హయ్యర్ ఆర్డర్ ఎంట్రప్రేన్యూర్ (HOE)గా మారి వారి యొక్క ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుచుకోవడమే కాకుండా మిగిలిన సంఘ సభ్యులకు ఉపాధిని కల్పిస్తున్నారు. లబ్దిదారుల ఆదాయం క్రమముగా మెరుగుపరచుకోవడం జరుగుతున్నది.జాతీయ స్థాయిలోనే ప్రధమ స్థానంలో ఉండటం సంతోషదాయకం.
ప్రధానముగా ధాన్యాలు, చిరు ధాన్యాలతో కూడిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, నూనె, బెల్లం తయారీ, పిండిమర, పచ్చళ్ళు తయారీ, కారం పొడులు మరియు ఇతర ఆహార ఉత్పత్తుల తయారీ కొరకు యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
మహిళలు కొత్త శిఖరాలను అధిరోహించే క్రమం మరియు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న స్త్రీల జీవనోపాధుల గురించి ఆశ్చర్యకరమైన కథలు తరచుగా వింటూనే ఉన్నాం. గ్రామాల్లో మహిళా శక్తి గురించి ఆలోచించకుండా గ్రామీణాభివృద్ధి గురించి ఆలోచించలేము, రెండు విదదీయరానివి. వీరు తమ జీవితాలలో, ఇతరుల జీవితాలలో, పెద్ద మార్పు తెచ్చిన సామాన్య వ్యక్తులు. పేదరికంలో నివసిస్తున్న ఈ గ్రామీణ నిరక్ష్యరాస్యులైన మహిళలు తగిన ప్రేరణతో అవసరమైన మార్పును తీసుకురాగలరనే నమ్మకంతో సెర్ప్ ప్రారంభమైనది. వారి విజయానికి సంబంధించిన కొన్ని విజయగాథలను మచ్చుకి పుస్తకంలో పొందుపరచడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News