Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు

Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. అంబటి రాంబాబు, ఆయన సోదరుడు మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదైంది. వైసీపీ హయాంలో గుంటూరులోని జూట్ మిల్లు స్థలాల విక్రయ్ం, గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్స్ అక్రమ నిర్మాణాలపై పోరాటం చేస్తున్న కార్మిక సంఘం నాయకుడు పిల్లి బాబూరావుపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు అంబటి సోదరులపై ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బెదిరింపులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.

- Advertisement -

దీంతో బాబూరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అంబటి సోదరులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో అంబటి రాంబాబు, మురళీకృష్ణతో పాటు మరికొందరిపై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News