Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Colleges Strike : ఈనెల 22 నుంచి ఏపీలో విద్యా సంస్థల బంద్.. ఉన్నత విద్యాసంస్థల...

Colleges Strike : ఈనెల 22 నుంచి ఏపీలో విద్యా సంస్థల బంద్.. ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య హెచ్చరిక!

Private degree colleges ready to strike: పక్క రాష్ట్రంలో కాలేజీల బంద్‌కు సంబంధించిన వ్యవహారం సర్దుమనిగిందో లేదో.. ఇక మన ఏపీలోనూ ఇప్పుడు సమ్మె సైరన్‌ మోగనుంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో బోధన రుసుములను వెంటనే చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు డిమాండ్‌ చేశాయి. లేదంటే సెప్టెంబరు 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాయి. ఈ మేరకు ఏపీ ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నాన జయరాం, పొదిలి పెద్దిరాజు పేర్కొన్నారు. మంగళగిరిలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ మధుమూర్తికి వినతిపత్రంని సైతం సమర్పించినట్లుగా తెలిపారు.

- Advertisement -

మౌలిక సదుపాయాలు అందించలేకపోతున్నాం: ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు అధికారులకు ప్రభుత్వ పెద్దలకు విన్నవించినా ఫలితం లేదని ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల బోధనా రుసుములను ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. అధ్యాపకులకు జీతాలు చెల్లించలేక పోతున్నామని పేర్కొంది. కాలేజీల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చలేకపోతున్నామని వారు తెలిపారు.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/is-democracy-alive-in-andhra-pradesh-ys-jagan-slams-chandrababu-govt/

అక్టోబర్ నుంచి నిరవధిక సమ్మె: ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ మొదటి వారం నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించినట్లు యాజమాన్యాల సంఘం తెలిపింది. ఇటీవల తెలంగాణలో కూడా కాలేజీల బంద్ జరిగిన నేపథ్యంలో.. ఏపీలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పక్క రాష్ట్రంలో నెలకొన్న వివాదం సుఖాంతం: ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై తెలంగాణ ప్రభుత్వం, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాల మధ్య నెలకొన్న వివాదం సుఖాంతమైంది. ప్రభుత్వ హామీతో తమ సమ్మెను విరమిస్తున్నట్లు కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కళాశాలల యాజమాన్యాలతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1200 కోట్లను దీపావళిలోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad