Thursday, November 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Rain alert: నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

Rain alert: నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

కొనసాగుతున్న తుపాను

నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం

- Advertisement -

ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిమీ, నాగపట్నానికి 320 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ మరియు చెన్నైకి 490 కి.మీ దూరంలో కేంద్రీకృతం

రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం

ఆ తర్వాత, ఇది ఉత్తర-వాయువ్య దిశగా పయనం

శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం

దీని ప్రభావంతో మూడు రోజులు (28-30) దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు,

రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం

మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం

దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ గరిష్టంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News