మండల వ్యాప్తంగా మే నెలాఖరులో ముంగారి (రోహిణి) కార్తెలో తొలకరి జల్లులు కురవడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న ఆశాభావంతో రైతులు జూన్ మొదటి వారంలో కందులు, ఆముదాలు విత్తుకున్నారు. విత్తనాలు విత్తి 15 రోజులు దాటినా ప్రస్తుతం చినుకు జాడే కానరాకపోవడంతో ఆందోళనతో రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కో రైతు ఎకరాకు 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేశారు.విత్తిన విత్తనాలు మొలకత్తక కొందరు, మొలకెత్తినా వర్షం కురవకపోవడంతో ఎండిపోతునట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ అరకొరగా ఉన్న పంటలైనా కాపాడుకుందామనుకుంటే జిల్లావ్యాప్తంగా గరిష్ట స్థాయిలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేసిన పంటకూడా ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నా వరుణుడు కరుణించడం లేదని రైతులు వాపోతున్నారు.ప్రస్తుతం వర్షం అవసరం కాగా వర్షం మాత్రం అదిగో ఇదిగో అంటూ రైతులను ఊరిస్తోంది. ఇలాగే ఇంకో 20 రోజుల్లోపు వర్షం కురవకపోతే ఖరీఫ్ సీజన్‌లో పంటలు అంతంతమాత్రమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఖరీఫ్ సీజన్‌లో వర్షాధారంపై ఆధారపడిన సాగుభూములే ఎక్కువ శాతం.ఈ భూముల్లో సిరుల పంటలు పండాలన్నా, రైతులు లాభసాటిగా ఉండాలన్నా వర్షం కురవాల్సిన పరిస్థితి ఉంది.ఒకవేళ విత్తనాలు మళ్ళీ విత్తుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే అధిక దిగుబడినిచ్చే పేరున్న కంపెనీల విత్తనాలను రైతులు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసి మళ్ళీ పెట్టుబడి పెట్టి అప్పులపాలు అవుతారని ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని మరింతగా పెంచి, విత్తనాలపై సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Rains delayed: ఆకాశం వైపు అన్నదాత చూపు
విత్తి 15 రోజులు దాటినా చినుకు జాడేది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES