Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Sudhakar Yadav: రామగిరి ఎస్సైకు చంపేస్తామంటూ బెదిరింపులు

Sudhakar Yadav: రామగిరి ఎస్సైకు చంపేస్తామంటూ బెదిరింపులు

శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్‌కు(Sudhakar Yadav) వైసీపీ క్యాడర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈమేరకు ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల రాప్తాడు నియోజకర్గం పర్యటన సందర్భంగా పోలీసులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల బట్టలు ఊడదిస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలకు ఎస్సై సుధాకర్ యాదవ్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

అప్పటి నుంచి సుధాకర్‌కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపైనా సోషల్ మీడియాలోనూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఐడీ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News