Ravi Naidu| మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja)పై ఏపీ స్పోర్ట్స్ అథారిటీ(SAAP) ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రోజా వేల కోట్ల రూపాయల ప్రభుత్వం సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయం కావడంతో ఓట్ల కోసం 17 సంవత్సరాలు పైబడిన వారికే ఈ పోటీల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కనీసం ఒక్క చిన్న సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
టూరిజం మంత్రి సాకుతో రోజు తిరమలకు వెళ్లి వందల మందికి దర్శనం చేయించండపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అయితే అంత మందికి దర్శనం చేయిస్తారా..? అని ప్రశ్నించారు. రోజా పెద్ద అవినీతి తిమింగలమని.. తిన్న అనినీతి సొమ్మును మొత్తం కక్కిస్తాం అని హెచ్చరించారు. ఆడుదాం ఆంధ్ర, తిరుమల దర్శనాల్లో ఆమె పాల్పడిన దోపిడీపై సీఐడీ విచారణ చేయిస్తాని తెలిపారు. భవిష్యత్తులో రోజాను కచ్చితంగా జైలుకు పంపిస్తామని రవినాయుడు వార్నింగ్ ఇచ్చారు.