Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: పార్టీలకు అతీతంగా పాలనే జగన్ లక్ష్యం

Shilpa: పార్టీలకు అతీతంగా పాలనే జగన్ లక్ష్యం

బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లి గ్రామంలో సర్పంచి షబ్బీర్ అహ్మద్, ఉపసర్పంచ్ రామలింగేశ్వరరెడ్డిల అధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పర్యటించి ముందుగా పార్నపల్లి గ్రామ నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. అనంతరం పార్నపల్లి సచివాలయాన్ని మరియు పార్నపల్లి నుండి యర్రగుంట్ల వరకు వేసిన తారురోడ్డును ప్రారంభించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా పార్టీలకు అతీతంగా నవరత్నాలను వాలంటరీల ద్వారా ప్రజలందరికీ అందించిన ఘనత జగన్ కే దక్కుతుందని,ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీ కార్యకర్తలు లబ్ధిపొందే ఈ రోజుల్లో పార్టీలకు అతీతంగా పాలన సాగించి సంక్షేమ ఫలాలు అందించటం ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి కే సాధ్యమని ఎమ్మెల్యే కొనియాడాడు . జగనన్న అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయనను గెలిపిస్తాయని, మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే ఎమ్మెల్యే అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రతి ఒక్కరూ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొరంటూ ఉదయం 7 గంటల-12 గంటల వరకు మరియు సాయంత్రం నాలుగుగంటల నుండి రాత్రి 9 గంటల వరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగించారు . ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, ఎంపిపి దేరెడ్డి చిన్నసంజీవరెడ్డి ,మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి ,జేసీఎస్ కన్వీనర్ ముడిమెల పుల్లారెడ్డి , మాజీ ఎంపిపి దేసు వెంకటరామిరెడ్డి ,గ్రామ నాయకుడు దిలీఫ్ రెడ్డి , ఎంపిటిసి శ్రీనివాసరెడ్డి ,ధర్మకర్త జనార్ధనరెడ్డి, ఎంపీడీఓ వాసుదేవగుప్తా, తహసీల్ధారు ఉమారాణి, ఆర్ ఐ సుప్రియ, ఎసై టి.బాబు, ఏపీఓ వసుధ, ఎపిఎం రాజశేఖరరెడ్డి ,విద్యుత్ శాఖ ఏ ఈ ప్రసాదరెడ్డి, పంచాయితీ కార్యదర్శి, భోజనం సర్పంచి బారెడ్డి భాస్కరరెడ్డి, పరమటూరు సర్పంచి జగన్మోహన్ రెడ్డి, కాకనూరు సర్పంచి మహేశ్వరరెడ్డి, ఎంఏఓ స్వాతి, కాకనూరు వెంకట సుబ్బయ్య , ఎర్రగుంట్ల పుల్లయ్య, హోసింగ్ ఏ ఈ సుంకిరెడ్డి, సింగిల్విండో ప్రసిడెంట్ భూరం శివలింగం, గ్రామ వాలంటరీలు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News