Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: సంక్షేమ పథకాలకు రారాజు జగన్

Shilpa: సంక్షేమ పథకాలకు రారాజు జగన్

గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే

బండిఆత్మకూరు మండలంలోని శింగవరం ,రామపురం గ్రామాలలో 107 వరోజు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎంపీడీఓ వాసుదేవగుప్తా ఎంఆర్ఓ రవికుమార్ పంచాయతీ సెక్రెటరీ బీ. సుజాత ల అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైల నియోజకవర్గం శాసనభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైల నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామనాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పూలదండలు, బొకేలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడపకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందివ్వాలన్నదే జగనన్న ఆశయం అని ప్రతి గడపకు వెళ్లిప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆప్యాయంగా ప్రజలను పలుకరిస్తూ సమస్యల పరిష్కార దిశగా కొనసాగించారు. సంక్షేమ ఫథకాలు కొనసాగించడంలో ప్రపంచంలో ఎవరూ సాటిరారని సంక్షేమ ఫథకాలకు రారాజు ముఖ్యమంత్రి జగన్ ఒక్కడే అని కొనియాడారు. ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి,మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస రెడ్డి జేసీఎస్ మండల ఇంఛార్జి ముడిమెల పుల్లారెడ్డి, ఎపిఎస్పిడిసిఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికలా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భూరం శివలింగం, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విక్రమ్ సింహ నాయక్, ఉప సర్పంచి అవుటాల నాగెశ్వరరెడ్డి, కో ఆప్షన్ జమాల్ బాషా, కాకనూరు సర్పంచి మహేశ్వరరెడ్డి, శంకర్ రెడ్డి, సుబ్బయ్య యాదవ్, బురుగయ్య, గౌడ్, బాషా, శ్రీనివాసులు దాసరి పుల్లయ్య, దాసరి శ్రీనివాసులు, శాఖమూరి సుబ్బారెడ్డి, ఎంపిటిసి రామయ్య , చక్రపాణి , వివిధ మండల స్థాయి అధికారులు, పోలీస్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News