Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: వాలంటీర్లు నిజమైన ప్రజా సేవకులు

Shilpa: వాలంటీర్లు నిజమైన ప్రజా సేవకులు

ప్రతి వాలంటీర్ సేవలను ప్రభుత్వం మరచి పోదని, వారి సేవలను గుర్తిస్తూ, ప్రశంసిస్తూ సేవావజ్ర , సేవారత్న, సేవా మిత్ర అవార్డులు

బండిఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం ఎంఈఓ కరిముల్లా అధ్యక్షతన జరిగింది. 2023-24 విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభం అయిన మొదటి రోజే ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల బట్టలు,టెక్స్ట్ బుక్ స్కూల్ బ్యాగ్స్, ఆక్స్ఫర్డ్ డికషనరీ, బెల్ట్ ఇతర వస్తువులను వరసగా 4వ సారి విద్యార్థులకు విద్యా సంవత్సర మొదటి రోజే అందించారు. అనంతరం మండల పరిధిలోని పార్నపల్లి టిటిడి కళ్యాణ మండపంలో వాలంటరీలకు వందనం కార్యక్రమమును శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు .

- Advertisement -

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా నిజమైన ప్రజా సేవకులుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుల గడపల వద్దకు అందిస్తున్న ప్రతి వాలంటీర్ సేవలను ప్రభుత్వం మరచి పోదని, వారి సేవలను గుర్తిస్తూ, ప్రశంసిస్తూ సేవావజ్ర , సేవారత్న, సేవా మిత్ర అవార్డులను, ప్రోత్సాహకాలను అందించి సన్మానిస్తామన్నారు. లంచాలు, వివక్షత లేకుండా పారదర్శకంగా సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ప్రభుత్వ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. మండలపరిధిలో ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లకు సేవావజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులను, ప్రోత్సాహకాలను అందించి ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే, మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు స్వచ్చందంగా మెరుగైన సేవలను అందిస్తున్న వాలంటీర్ల సేవలను ప్రభుత్వం గుర్తించి సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులను, ప్రోత్సహకాలను అందించి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడా వివక్షతకు తావు లేకుండా అర్హులైన అందరికి వాలంటీర్లు సంక్షేమ పథకాలను లబ్దిదారుల గుమ్మం వద్దకు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు సుపరిపాల అందించేందుకు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా సాధ్యం అయ్యిందన్నారు. ఇటువంటి వ్యస్థ దేశంలో ఎక్కడా లేదని, దేశంలో ఇతర రాష్ట్రాలకు మన జగనన్న ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మద్యవర్తులుగా వాలంటీర్లు ఉంటూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు తెలిజేసే బృహత్తర బాధ్యత వహించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో పథకాలు లబ్ధిదారులకు అందాలంటే అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, నేడు జగనన్న ప్రభుత్వంలో నేరుగా సచివాలయాల ద్వారా వాలంటీర్ల సహకారంతో నిజాయితీగా, ఎటువంటి వివక్షతకు తావు లేకుండా పథకాలను అందిస్తున్నామన్నారు. ప్రజలకు స్వచ్చందంగా సేవలను అందిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వాలంటీర్ల సేవలు అద్భుతంఅని కొనియాడారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలకు వాలంటీర్లు చేసిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. అనేక రాష్ట్రాలు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేయడానికి గర్వంగా ఉందన్నారు. నవరత్నాల రూపకర్త జగనన్న ప్రతి పథకాన్ని తూచాతప్పకుండా అమలు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేసిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలను నిర్వీర్యం చేసి రద్దు చేయడం ఖాయం అన్నారు. కాబట్టి ప్రజలకు మంచి చేసేందుకు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అలాగే సీఎం జగనన్న అమలు చేస్తున్న అన్ని పథకాలను తొలగించే అవకాశం ఉందన్నారు. ఉందన్నారు. వాలంటీర్లు ప్రజాప్రతినిధులతో, అధికారులతో, ప్రజలతో సమన్వయం కలిగి మరింత మెరుగైన సేవలను అందించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి కృషిచేయాలని కోరారు. సుపరిపాలన అందించే ప్రజాప్రభుత్వం జగనన్న ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టాలంటే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల సహకారం, కృషితో సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపి పి దేరెడ్డి చిన్నసంజీవరెడ్డి, మాజీ ఎంపిపి దేసు వెంకట రామిరెడ్డి , మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ వాసుదేవగుప్తా, ఎమ్మారో ఉమారాణి ఆర్.ఐ సుప్రియ ,సింగిల్విండో ప్రసిడెంటు భూరం శివలింగం,విక్రమ సింహా నాయక్ పార్నపల్లి సర్పంచి షబ్బీర్ అహమ్మద్, వివిధ గ్రామాల పంచాయతి కార్యదర్శులు, వివిధ గ్రామాల వాలంటరీలు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News