Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Sridevamma: జగనన్నతోనే రాష్ట్ర అభివృద్ధి

Sridevamma: జగనన్నతోనే రాష్ట్ర అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక జగనన్నతోనే సాధ్యమని ప్రత్యేక శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి అన్నారు. మద్దికేరలో ఒకటో సచివాల నూతన భవనాన్ని ఆమె జడ్పిటిసి మురళీధర్ రెడ్డి మండ మండల పరిషత్ అధ్యక్షురాలు అనిత యాదవ్ ల ఆధ్వర్యంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని రైతు భరోసాలు విలేజ్ హెల్త్ సెంటర్లు నిర్మించి ప్రతి పల్లెకు అధికారులు తీసుకువచ్చి పనులు చేస్తున్నారని వీరికి అనుగుణంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ దేనన్నారు పత్తికొండ నియోజకవర్గం నీ అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని ఆమె అన్నారు ఎన్నో ఏళ్లుగా పత్తికొండ వాసులకు ఇరుకైన రోడ్లతో ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురయ్యారని ఈ ప్రభుత్వంలో రోడ్లు విస్తరణ పనులను తెలిసిన ఘనత మాదే అన్నారు మద్దికేర మండలనీ సైతం అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు మద్దికేర నుండి మజార గ్రామమైన బొజ్జనాయిని పేటకు కొత్తగా రోడ్డు అన్నారు పేద పిల్లలు చదువుకు దూరంగా ఉండకూడదని అమ్మబడి వసతి దీవెన విద్యా దీవెన ప్రవేశపెట్టి విద్యార్థుల తల్లి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామన్నారు. ఇలా చేసుకుంటూ పోతుంటే ప్రతిపక్షాలకు ఓర్పు లేకుండా పోయిందని ప్రభుత్వాన్ని విమర్శించడం సరైంది కాదన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రేలంపాడు వెంకటేశ్వర్లు పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ కుమ్ములూరి పకీరప్ప మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ మాజీ ఎంపిటిసి డి శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఉన్నారు…. ప్రహరి గోడకు భూమి పూజ.. మండల కేంద్రమైన మద్దికేరలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు 25 లక్షలతో ప్రహరీ గోడ నిర్మించేందుకు శనివారం పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి భూమి పూజ చేశారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే కాంపౌండ్ లోనే ఉండాలని ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మురళీధర్ రెడ్డి ఎంపీపీ అనిత యాదవ్ సర్పంచ్ బండారు సుహాసిని ఎంపీడీవో నరసింహమూర్తి వివిధ శాఖ అధికారులు వైసిపి నాయకులు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News