పత్తికొండ పట్టణంలో సచివాలయం-5 వార్డు పరిధిలోని కొత్త బస్టాండ్ వెనకాల లక్ష్మి నగర్, సాయిబాబా గుడి ఎదురుగా 18 వార్డులలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పల్లె కళావతి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, ఎంపిపి నారాయణ దాస్.సర్పంచ్ కొమ్ము దీపికలతో కలసి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొన్నారు. ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామంలో పర్యటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మ్యానిపెస్టోలో హామీలను జగనన్న ప్రభుత్వం 95 శాతం అమలు చేశామని, కుల-మతతత్వ పార్టీలకు అతీతంగా వాలంటీర్లు గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా ప్రభుత్వం ప్రతి ఇంటి వద్దకు వచ్చి పనిచేస్తుందని తెలియజేశారు. అనంతరం స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మూడు రంగుల జాతీయ పతాకాన్ని ఎగరేసి, పావురాన్ని గాలిలో ఎగరేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నారాయణదాసు మండల కన్వీనర్ నాగరాజు.ప్రతాప్ రెడ్డి.హోటల్ రామచంద్ర.భాస్కర్.నాయక్ మండల కో ఆప్షన్ నెంబర్ నజీర్.వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Sridevi: జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం
పత్తికొండలో గడప గడపకులో పాల్గొన్న ఎమ్మెల్యే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES