Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలంలో 19 కోట్లతో వైద్యశాలల అభివృద్ధి

Srisailam: శ్రీశైలంలో 19 కోట్లతో వైద్యశాలల అభివృద్ధి

ప్రజారోగ్యం కోసం వేల కోట్లు ఖర్చు

రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల ఆరోగ్యం కోసం వైసిపి ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందని, శ్రీశైలం నియోజకవర్గంలోనే 19 కోట్ల రూపాయలతో వైద్యశాలలు నిర్మించి పేద ప్రజలకు వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో 3.90 కోట్లతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిల మీద ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేసి ఎంతో మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు అంతేకాకుండా మన ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలందరకి మంచి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్ ను ఆదేశించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆసుపత్రి నందు ఏదైనా వసతులు గురించి, సమస్యలు నా దృష్టికి తీసుకువస్తే త్వరగా పరిష్కరించడం జరుగుతుందని .అదే విధంగా ఆసుపత్రికి  సరైన సిబ్బంది ఉండాలని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్టు డాక్టర్లు ఉండాలని హాస్పిటల్ సూపర్డెంట్ రాయుడు ను ఎమ్మెల్యే ఆదేశించారు.

ఎమ్మెల్యే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించడం జరిగింది అలాగే ప్రతిపక్ష నాయకులు ఇంత అభివృద్ధి జరుగుతున్న వారి కళ్లకు కనపడడం లేదని ప్రజలందరూ మన ప్రభుత్వం ద్వారా పొందుతున్న లబ్ధి ఆరోగ్యం విషయం పట్ల తీసుకుంటున్న ఎన్నో జాగ్రత్తలు సమూలమైన మార్పులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మార్పులు వైద్య రంగంలో తీసుకొచ్చారని ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కేసులు గాని ఇంకేదైనా సంబంధించిన ఆపరేషన్ పరంగా వచ్చిన రోగులకు మంచి భోజనం అందించాలని ఈ భోజనం ఖర్చులకు గాను నా వంతు సాయం కచ్చితంగా చేస్తానని డాక్టర్లకు ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు  , పత్రికా సభ్యులు ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి ఉంటే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. ఈ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను రాబోయే రోజులలో వంద పడకల హెల్త్ సెంటర్ గా చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి నాయకులు, శిల్ప భువనేశ్వర్ రెడ్డి ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ ఆసియా మారుఫ్, జడ్పిటిసి సభ్యులు శివశంకర్ రెడ్డి, ఎంపీపీ నల్లకాల్వ తిరుపాలమ్మ, వైయస్సార్ పార్టీ ఆత్మకూరు టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ మీర్, వైఎస్ఆర్ పార్టీ ఆత్మకూరు మండల ప్రెసిడెంట్ రాజమోహన్ రెడ్డి , మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలస్వామి , సింగల్ విండో చైర్మన్ సురేష్ , ఆత్మకూరు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ రషీద్ ,ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రాజగోపాల్ , పువ్వాడి భాస్కర్ , ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు విజయ్ చౌదరి,ఆత్మకూరు మండల పట్టణ ప్రజా ప్రతినిధులు ఆత్మకూరు మండలం పట్టణ నాయకులు ఇన్చార్జులు సచివాలయ కన్వీనర్స్ ,గృహసారథులు, కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రాయుడు,వెంకటరాముడు, అధికారులు, ఆస్పత్రి సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News