శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలిబాటన వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే పనుల్లో ఆలయ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారుల బృందం నాగలూటి, దామర్లకుంట, పెద్దచెరువు ప్రాంతాలను పరిశీలించారు. కాగా బ్రహ్మోత్సవాలలో నాగలూటి వద్ద జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు పండాల్స్ వేస్తారు. మంచి నీటి సరఫరా, జనరేటర్ ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ పనులు కూడా చేస్తున్నారు.
శ్రీశైలంలో ఫిబ్రవరి 11 నుండి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులు పాదయాత్రతో వెంకటాపురం, నాగలూటి, దామర్లకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాసద్వారం మీదుగా శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుంటారు. ఈ కారణంగా కాలిబాట మార్గములో అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించాల్సి వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున శివ భక్తులు, శివమాలా దీక్షాదారులు ప్రతి ఏటా కాలి నడకన శ్రీశైలం చేరుకుని, భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు.
Srisailam: కాలినడక భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న శ్రీశైలం దేవస్థానం
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES