Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: రావణ వాహనంపై ఆది దంపతులు

Srisailam: రావణ వాహనంపై ఆది దంపతులు

శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మూడవ రోజు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహన సేవపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయం విద్యుత్ దీప కాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహన సేవపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండువగా ఆలయ ప్రదక్షిణలు గావిస్తూ గ్రామోత్సవంలో విహరింప చేశారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News