శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ దంపతులు వచ్చారు. గంగాధర మండపం వద్ద రాష్ట్ర గవర్నర్, వారి ధర్మపత్ని సుప్రభ హరిచందన్ కుటుంబ సభ్యులకు ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్న, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రత్నగర్భగణపతి స్వామి వారిని దర్శించుకుని హారతిని స్వీకరించారు. తదుపరి శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మల్లికా గుండంలో (సరస్వతీ నదీ అంతర్వాహిని) ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు.





