Friday, June 28, 2024
Homeఆంధ్రప్రదేశ్ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు

ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు

అట్టహాసంగా అమెరికా తెలుగు వారి సభలు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి NRI లతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రి ఎర్రబెల్లి USA లోని ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, అక్కడికి వచ్చిన NRI లతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…. ఎవరు ఎక్కడ ఉన్నా, nri లు సహా, తెలుగు ప్రజలు ఒక్కటేనని, ఈ సభలకు ప్రతి సంవత్సరం హాజరవుతానన్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. Nri లు అందరికీ మహా సభల శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News