తెలుగుదేశం పార్టీ(TDP) 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. 1982వ సంత్సరంలో మార్చి 29వ తేదీన హైదరాబాద్‌లో దివంగత నందమూరి తారక రామారావు(NTR) తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, మరికొన్ని అపజయాలు చవిచూసింది. రేపటితో 43వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించానున్నారు.
ఇక మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరగనున్న వేడుకలకు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) హాజరుకానున్నారు. శనివారం ఉదయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు పార్టీ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. 2024లో మరోసారి అధికారం చేపట్టిన తర్వాత జరగనున్న ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
