ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు హెచ్ఆర్డీఏ మంత్రి నారా లోకేష్ సూచనలతో టీడీపీ బద్వేల్ సమన్వయకర్త రితేష్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఇటీవల జరిగిన కాశీనాయన(Kasinayana) ఆలయ నిర్మాణాల కూల్చివేత ఘటన గురించి రితేష్ రెడ్డి గారు కేంద్ర మంత్రికి వివరించి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులు ఇచ్చి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఆలయ సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, సానుకూలంగా స్పందించి త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని టిడిపి బద్వేల్ సమన్వయకర్త రితేష్ రెడ్డికి తెలిపారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త భూపేష్ రెడ్డి , శశిభూషణ్ రెడ్డి , సింగారెడ్డి మరియు RSS మరియు VHP పెద్దలు పాల్గొన్నారు.