తెలుగుప్రభ దినపత్రిక క్యాలెండర్ ను ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్థానిక పట్టణములో మార్కెట్ యార్డ్ ఆవరణలో తెలుగు ప్రభ నియోజవర్గం ఇంచార్జి గోపి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ బైరెడ్డి సిధార్థ రెడ్డి మాట్లాడుతు ప్రజా సమస్యలను ప్రభుత్వము దృష్టికి తీసుకొస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి అనతి కాలంలోనే అభివృద్ధి చెందుతున్న తెలుగుప్రభ దినపత్రిక అని పేర్కొన్నారు. మరింతగా దినదిన అభివృద్ధికి నోచుకోవాలని తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలుగుప్రభ దినపత్రిక దినదిన అభివృద్ధి చెందాలి
వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ దార, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ
తెలుగు దినపత్రిక ప్రజా పక్షాన అండగా నిలబడుతూ అనతి కాలంలోనే అభివృద్ధి చెందడం ఎంతో శుభ పరిణామం అన్నారు. సమాజంలో దినపత్రికల ప్రాధాన్యత ఎంతో ఉందని, ప్రధాన పత్రికలకు సరసన తెలుగు దినపత్రిక నిలుస్తుందని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన నిలబడిన తెలుగు ప్రభ దినపత్రిక యాజమాన్యానికి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బద్దుల శ్రీకాంత్, కౌన్సిలర్ లాలు, వైఎస్ఆర్సిపి యువత పట్టణ అధ్యక్షులు లడ్డు మరియు వైసీపీ నాయకులు వెంకటరమణ, అల్లరి మధు తదితరులు పాల్గొన్నారు.


