Thursday, March 13, 2025
Homeఆంధ్రప్రదేశ్Tenth Exams: ఏపీలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి...

Tenth Exams: ఏపీలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలు

ఈనెల 17వ తేదీ నుండి మార్చి 31 తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలను( Tenth Class Examinations) సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం రాత్రి అమరావతి నుండి పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, కలెక్టర్ కాన్ఫరెన్స్, స్వర్ణాంధ్ర, స్వచ్చాంద్ర తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ కావేటి విజయానంద్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా వీసి ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ కావేటి విజయానంద్ మాట్లాడుతూ… పదవ పరీక్షలకు సంబంధించి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. మొత్తం 3,450 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే ఈ పరీక్షా కేంద్రాలలోనికి ఉన్నతాధికారులతో సహా ఏ ఉద్యోగి కూడా సెల్ ఫోన్ లను తీసుకెళ్లడం నిషేదించినట్టు స్పష్టం చేశారు. పరీక్షా ప్రశ్నా పత్రాలను స్ట్రాంగ్ రూమ్ లకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని తెలిపారు. పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్ సూపరింటెండెంట్ లు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.


పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్.టి.సి బస్సులు తగు విధంగా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.పదవ పరీక్షల కోసం రాష్ట్ర స్థాయిలో 0866297454 నెం తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర దివస్ ఏర్పాట్లపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.పీ 4 సర్వే ప్రోగ్రెస్ పై కలెక్టర్లకు అడిగి తెలుకున్నారు.

సిఎస్ విసి ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ పదవ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు,ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అలాగే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల పరిధిలో ఇంటర్‌నెట్‌, జెరాక్స్‌ సెంటర్‌లను మూసి వేయించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు,ఇతర ఉన్నతాధికారులతో సహా ఏ ఇతర సిబ్బంది ఎలక్ట్రానిక్ పరికరాలు,మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లరాదన్నారు. పోలీసులు ముందుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలన్నారు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్‌లు ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ రకాల పధకాలపై ప్రజా అభిప్రాయాలను చేపట్టాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News