Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Ttd Darshanam: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక: అక్టోబర్ నెల దర్శన కోటా వివరాలు..!

Ttd Darshanam: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక: అక్టోబర్ నెల దర్శన కోటా వివరాలు..!

TTD Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శన టిక్కెట్లు, గదుల కోటాలను విడుదల చేసే తేదీలను ప్రకటించింది. భక్తులు ఈ వివరాలను గమనించి, తమ దర్శనాలను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.

- Advertisement -

ముఖ్యమైన తేదీలు మరియు సమయాలు:

ఆర్జిత సేవా టిక్కెట్లు (ఎలక్ట్రానిక్ డిప్):

అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను జూలై 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఈ సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

లక్కీడిప్‌లో టిక్కెట్లు పొందిన వారు జూలై 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టిక్కెట్లు:

ఈ సేవల టిక్కెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

వర్చువల్ సేవల కోటా:

వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్‌లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

అంగప్రదక్షిణం టోకెన్లు:

అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా:

శ్రీవాణి ట్రస్టు టిక్కెట్ల ఆన్‌లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి దర్శన కోటా:

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా:

ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

తిరుమల, తిరుపతిలలో గదుల కోటా:

తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ అయిన https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని టీటీడీ కోరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad