Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Thoguru Arthur: సీఎం జగనన్న మనస్సులో నా స్థానం పదిలం..నా గాడ్ ఫాదర్ వైయస్సార్

Thoguru Arthur: సీఎం జగనన్న మనస్సులో నా స్థానం పదిలం..నా గాడ్ ఫాదర్ వైయస్సార్

జగనన్న కోసం కార్యకర్తలా పని చేస్తా

జగనన్న నాపై ఉంచిన నమ్మకాన్ని నాలుగేళ్ల కాలంలో ప్రజలకు సేవ చేస్తూ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని సీఎంగా చూడాలనే తపనతోనే అహర్నిశలు శ్రమిస్తున్నానని, జగనన్న మనసులో స్థానం సంపాదించుకున్నానని, దివంగత నేత వైయస్సార్ నా గాడ్ ఫాదర్ అని ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాలలో, వైసీపీ అభిమానులు ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహాలను శుభ్రం చేయడం, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని, కార్యకర్తలకు నాయకులకు సూచించారు. జగనన్న తనపై ఉంచిన నమ్మకాన్ని నాలుగేళ్ల కాలంలో ఎక్కడా వమ్ము చేయలేదని.. జగనన్నకు విధేయుడుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు సేవ చేశానన్నారు. అంతేకాకుండా ప్రజల ఆశీస్సులతో జగనన్న దీవెనలు ఉంటే మరోసారి ప్రజలకు సేవ చేసేందుకు జగనన్నను సీఎం చేసేందుకు, కృషి చేస్తానన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News