Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirupati: తిరుపతి తొక్కిసలాట.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కీలక పిలుపు

Tirupati: తిరుపతి తొక్కిసలాట.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ కీలక పిలుపు

తిరుపతి(Tirupati)లో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

- Advertisement -

“తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఈ కష్టకాలంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరుతున్నాను” రాహుల్ తెలిపారు.

మరోవైపు ఏసీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. “తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 గురు భక్తులు చనిపోవడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. తొక్కిసలాటకు కారణం పాలన వ్యవస్థలో నిర్వహణ లోపాలే. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపించాలి.” అని షర్మిల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News