Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Train accident: మృతుల్లో ఏపీకి చెందిన వారికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా

Train accident: మృతుల్లో ఏపీకి చెందిన వారికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా

కేంద్రం ప్రకటన

విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్‌ చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి తెలియజేశారు. సహాయ బృందాలను వెంటనే ఘటనాస్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఘటనా స్థలానికి మంత్రి బొత్స సత్యన్నారాయణను పంపించామని, స్థానిక కలెక్టర్‌, ఎస్పీకూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆమేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.

- Advertisement -

మృతుల్లో ఏపీవారికి రూ.10 లక్షలు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటే వారికి రూ.2లక్షలు:
రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించాలన్నారు. అలాగే మరణించన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారికి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News