Saturday, May 25, 2024
Homeఇంటర్నేషనల్Bathukamma and Dasara @ Canada: బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా నిర్వహించిన తెలంగాణ...

Bathukamma and Dasara @ Canada: బతుకమ్మ, దసరా పండుగలను ఘనంగా నిర్వహించిన తెలంగాణ కెనడా అసోసియేషన్

సంప్రదాయబద్ధంగా తెలుగు పండుగల వేడుకలు

కెనడా టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు నిర్వహించారు.

- Advertisement -

టొరంటో-కెనడా లో ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 3500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక ఆనాపిలిస్ హాల్- మిస్సిసాగా లో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. శ్రీమతి శిల్పా చందా గారు, శ్రీమతి శ్రీదేవి కల్లేపల్లి గారు, శ్రీమతి సమత కాకర్ల గారు, శ్రీమతి వైదేహి భగత్ గారు మరియు శ్రీమతి అన్నపూర్ణ గారు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్ గా వ్యవహరించిన గెట్ హోం రియాల్టీ వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు శాలువాలతో అభినందించి TCA మొమెంటోస్ బహుకరించారు.

ఈ సంవత్సరం విశేష స్పందనతో అనూహ్య విధంగా 95 బతుకమ్మలను తీసుకువచ్చి టొరంటో తెలంగాణ ప్రజలు బతుకమ్మలపై వారికి ఉన్న భక్తిని చాటుకున్నారు. పలు వంటకాలతో పాట్ లక్ విందు భోజనం సమకూర్చారు. ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై వారికి ఉన్న భక్తిశ్రద్ధలను కొనియాడారు. తెలంగాణ కెనడా సంఘం ఈ సందర్భంగా వారి అధికారిక తెలుగు పత్రిక TCA బతుకమ్మ సంచికను విడుదల చేశారు.

ఈ సంబరాలలో సుమారు 5 గంటలు ఏకధాటిగా బతుకమ్మ ఆట పాటలతో చివరగా పోయిరావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగిపుంగా వెళ్లి నిమజ్జనం చేశారు. తరువాత సత్తుపిండి, నువ్వుల పిండి, పల్లీల పిండి ప్రసాదం పంపిణి చేసారు. ఈ సంవత్సరం బతుకమ్మలలో అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణsతలుగా శ్రీమతి మనస్విని వేలపాటి మరియు శ్రీమతి ప్రదీపావాల వ్యవహరించారు. ఇందులో విజేతలకి విభూతి ఫ్యాబ్ స్టూడియోస్ వారు, తెలంగాణ కెనడా అసోసియేషన్ వారు, సండైన్ తెలుగు ఫుడ్స్ వారు బహుమతులను అందజేశారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ దసరా సంబరాలను జీవితకాల సభ్యులకు కొరకు నిర్వహించారు. దసరా సంబరాల్లో భాగంగా దుర్గా పూజా జరిపిన అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకున్నారు. తెలంగాణ ప్రామాణికలతో రుచికరమైన విందు సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు- శ్రీ మనోజ్ రెడ్డి, కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్ర , సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి శ్రీ వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలనేని, డైరెక్టర్లు – శ్రీ నాగేశ్వరరావు దలువాయి, శ్రీ ప్రవీణ్ కుమార్ సామల, శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు – శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక సభ్యులు – శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ ప్రకాష్ చిట్యాల, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ హరి రావుల్, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ రాజేశ్వర్ ఈధ, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల పాల్గొన్నారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు తెలుగు సంస్కృతిని చక్కగా వివరించి ఈ వేడుకలను విజయవంతం చేసిన తెలుగు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ, దసరా వేడుకలు కొన్ని సంవత్సర క్రింద కేవలం 800 మందితో ప్రారంభమయ్యి ఈ నాడు 3500 మందికి పైగా తెలంగాణ కుటుంబాలు ఒక చోట కలుసుకొని పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అందరూ అభిప్రాయపడ్డారు. చివరగా తెలంగాణ కెనడా అసోసియేషన్ స్పాన్సర్లకు, ఈ కార్యక్రమం స్పాన్సర్లకు మరియు డిన్నర్ పాట్ లాక్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News