Thursday, October 31, 2024
Homeఆంధ్రప్రదేశ్BR Naidu: శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలి.. శ్రీవారి భక్తులకు గంటలోపు దర్శనం కల్పించాలి: బీఆర్...

BR Naidu: శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలి.. శ్రీవారి భక్తులకు గంటలోపు దర్శనం కల్పించాలి: బీఆర్ నాయుడు

BR Naidu| గత వైసీపీ ప్రభుత్వం తిరుమల(Tirumala)లో చాలా అరాచకాలు చేసిందని టీటీడీ చైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు విమర్శించారు. టీటీడీ ఛైర్మన్‌)(TTD Chairman) పదవి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనను ఈ పదవిలో నియమించినందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawankalyan), ఇతర ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులను ఎక్కువసేపు కంపార్టుమెంట్లలో ఉంచడం మంచిది కాదన్నారు. చిన్నపిల్లలను అలా ఎక్కువ సమయం ఉంచితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లు కంపార్టుమెంట్లలో పిల్లలకు పాలు కూడా ఇవ్వలేదని.. కొత్త ప్రభుత్వం వచ్చాక పాలు, అల్పాహారం పెడుతున్నారని పేర్కొన్నారు. ఇకపై భక్తులకు గంటలోపు దర్శనం పూర్తికావాలనేది తన ఆలోచన అన్నారు. అలాగే శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనేది తన ఆలోచన అని చెప్పారు. ఒక పెద్ద ట్రస్టు ఉన్నప్పుడు మరో ట్రస్టు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉన్న టైమ్‌ స్లాట్‌ పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని స్పష్టంచేశారు.

తాను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగానని.. చిన్నప్పటి నుంచి తిరుమలకు తప్ప వేరే ఆలయాలకు వెళ్లేవాడిని కాదన్నారు. తమ చిత్తూరు ప్రాంతంలో కొండకు పోతాం అంటామని.. కొండ అంటే తిరుమల అని తెలిపారు. ఈరోజుకీ అక్కడ అదే ఆనవాయితీ ఉందన్నారు. టీటీడీ ఛైర్మన్‌ పదవి రావడం తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నానన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని మండిపడ్డారు. గతంలో ఏడాదికి ఐదారుసార్లు వెళ్లేవాళ్లమని.. అలాంటిది గత ఐదేళ్లూ అక్కడ పవిత్రత లేదని వెళ్లలేదన్నారు. తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువై ఉండాలనేదే తన ప్రయత్నమని తేల్చిచెప్పారు.

తిరుమలలో నెలకొన్న సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చించానని.. .టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక చంద్రబాబు సలహాలతో ముందుకెళ్తానన్నారు. నీతి, నిజాయతీగా పనిచేయాలనేదే తన కోరికన్నారు. సొంత డబ్బుతో తిరుమలకు సేవ చేయాలనుకుంటున్నామని.. తిరుమల పవిత్రతను కాపాడాలని అందరినీ కోరుతున్నానని తెలిపారు. తిరుమలలో ఇకపై ప్రతి విషయాన్నీ టీటీడీ బోర్డు మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తనపై వచ్చే విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసని.. తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకెళ్తానని బీఆర్ నాయుడు హెచ్చరించారు. .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News